సాక్షి, హన్మకొండ: ‘శ్రీదేవి, సమంతలతో ఫోటోలు దిగేందుకు కల్వకుంట్ల
తారకరామారావుకు సమయం ఉంటుంది... కానీ కరెంటు కోతలతో విలవిల్లాడుతున్న
రైతులను పరామర్శించేందుకు తీరిక లేదా..’ అంటూ టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత
రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ
చేపట్టిన బస్సుయాత్ర శనివారం వరంగల్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా
రేవంత్ మీడియా తో మాట్లాడారు. ‘రాష్ట్రంలో విద్యుత్ శాఖను ఎవ్వరికీ
అప్పగించలేదు. కనీసం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సమీక్ష పెడితే, రాష్ట్రం
తరఫున హాజరయ్యేందుకు ఏ ఒక్క మంత్రికీ అదనపు బాధ్యతలు అప్పగించలేదు. సమంత,
శ్రీదేవిలతో క్యాట్‌వాక్ చేయకుండా, ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి
విద్యుత్ తీసుకురావాలని కేటీఆర్‌ను డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు.
ఓవైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు సీఎంకేసీఆర్ క్యాంపు కార్యాలయంలో తలసాని, తీగల, చల్లా వంటి టీడీపీ నేతలతో చర్చలు జరుపుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. టీడీపీ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే రైతుల కష్టాలు తీరుతాయా? అని ప్రశ్నిం చారు. కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌ను తెచ్చేందుకు ఢిల్లీ పర్యటనలో సీఎం ప్రయత్నిస్తారని భావిస్తే ఆయన తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు విషయంపై చర్చించి వచ్చారన్నారు. సమస్యల ప్రాధాన్యాన్ని గుర్తించడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. విద్యుత్ సమస్యపై కేంద్రంతో పోరాటం చేయాల్సిన11 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు, ఆ పని మాని టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారంటూ విమర్శిం చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందని, ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకే తాము బస్సుయాత్ర చేస్తున్నామని అన్నారు.
అఖిలపక్ష సమావేశం పెట్టండి : ఎర్రబెల్లి
‘అఖిలపక్ష సమావేశం పెట్టండి. తెలంగాణలో విద్యుత్ సమస్యలకు చంద్రబాబు కారణమని తేలితే, మేము ముక్కు నేలకు రాస్తాం’ అని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. నెల పాటు తమకు అధికారం అప్పగిస్తే కరెంటు సమస్యలు తీరుస్తామని, రైతులకు నాణ్యమైన కరెంటు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీ అంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని, అందువల్లే ప్యాకేజీలిచ్చి టీడీపీ నేతలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తవు పార్టీని దెబ్బతీయలేరన్నారు. తాను పార్టీని విడిచి పోనని.. తెలంగాణలో టీడీపీ జెండా ఎగురుతుందని ఎర్రబెల్లి అన్నారు. ధర్మారెడ్డి పార్టీని వీడడం బాధాకరమని పేర్కొన్నారు. రూ.250 కోట్ల కాంట్రాక్టు దొరుకుతుందని ధర్మారెడ్డి ఆశపడ్డారన్నారు. ‘ఈ నాలుగేళ్లు పార్టీని కాపాడుకుంటాం... కార్యకర్తలకు కాళ్లు మొక్కి చెబుతున్నా ఏ ఒక్కరూ పార్టీని విడిచి వెళ్లవద్దు’ అని కోరారు. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారని అందులో ఒకడు తిరుగుబోతు, తాగుబోతు అని, మరొకడు కష్టపడి పనిచేసేవాడని.. కష్టపడి పనిచేసేటోడు చంద్రబాబు అని ఆయన చెప్పా రు. ధాన్యం బస్తాకు రూ.1,700-1,800, పత్తి క్వింటాల్‌కు రూ.5,000 మద్దతు ధర ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. టీడీపీని బలహీనపరిచేందుకు ఆనాడు ఇందిరాగాంధీ కూడా ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు.
ముందుగా ఎనుమాముల సందర్శన
టీడీపీ నేతలు శనివారం ఉదయం ముందుగా వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. మార్కెట్‌లోని వ్యాపారులు, అధికారులతో వూట్లాడి రైతులకు గిట్టబాటు ధరలు చెల్లించాలన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఏకశిల పార్కు నుంచి నేతల ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ కార్యాలయం చేరుకుంది. అక్కడ రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్ర శేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, విజయరమణారావు, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. ధర్నా ముగిసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు బస్సు యాత్ర బయలుదేరి వెళ్లింది.

Comments
Post a Comment